E-PAPER

NEET పేపర్ లీక్‌పై మరోసారి నిరసన.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత మార్చ్

కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి ఉద్యమానికి సిద్ధమైంది. NEET పేపర్ లీక్ అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 5న శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించింది. గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడంతో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనను విరమించినట్లు పార్టీ తెలిపింది.

అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇతర హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ మరోసారి నిరసనకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. సీజేపీ ప్రకారం సెప్టెంబర్ 5న జరగనున్న ఈ శాంతియుత మార్చ్ ఇండియా గేట్ నుంచి ప్రారంభమై ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మార్చ్‌కు NEET పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసుల చర్యల్లో బాధితులైన వారి కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తారని సీజేపీ వెల్లడించింది. విద్యార్థులు, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్లతో ఈ నిరసన చేపడుతున్నట్లు పేర్కొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!