E-PAPER

Dandruff: చుండ్రు ఎందుకు మళ్లీ మళ్లీ వస్తుంది? అసలు కారణం ఇదే..

చుండ్రు సమస్య చాలామందిని తరచూ ఇబ్బంది పెడుతుంటుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉపయోగించిన తర్వాత కొంతకాలం స్కాల్ప్ శుభ్రంగా కనిపించినా, కొన్ని రోజులకే మళ్లీ తెల్లటి పొరలు, దురద వంటి సమస్యలు మొదలవుతుంటాయి. అయితే చుండ్రు ప్రతి ఒక్కరిలో ఒకే కారణంతో ఏర్పడదని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. కొందరిలో ఇది దీర్ఘకాలికంగా ఉండే సమస్య కావడంతో పూర్తిగా నిర్మూలించడం కంటే నియంత్రణలో ఉంచడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

మన స్కాల్ప్‌లోని సెబేషియస్ గ్లాండ్స్ సహజసిద్ధమైన నూనె అయిన సెబమ్‌ను ఉత్పత్తి చేస్తాయి. కొందరిలో ఇవి అధికంగా పనిచేయడం వల్ల స్కాల్ప్ ఎక్కువగా ఆయిలీగా మారుతుంది. ఈ పరిస్థితి Malassezia అనే ఈస్ట్ పెరుగుదలకు అనుకూలంగా మారుతుంది. సాధారణంగా ఈ ఈస్ట్ చర్మంపై ఉన్నప్పటికీ, కొందరిలో దాని ప్రభావంతో స్కాల్ప్‌లో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి చర్మ కణాలు వేగంగా రాలిపోతాయి.

దీంతో తెలుపు లేదా పసుపు రంగులో ఉండే ఫ్లేక్స్ స్కాల్ప్‌పై కనిపిస్తాయి. ఇదే చుండ్రుగా మారుతుంది. అందుకే ఒకే ఇంట్లో నివసించే ఇద్దరిలో ఒకరికి తరచూ చుండ్రు సమస్య ఉన్నప్పటికీ, మరొకరికి ఎలాంటి సమస్య లేకపోవచ్చు. చుండ్రు తరచూ పునరావృతమవుతుంటే కారణాన్ని గుర్తించి, నిపుణుల సూచనలతో సరైన చికిత్స, స్కాల్ప్ కేర్ పాటించడం ద్వారా సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!