పుష్అప్స్ చేయడమే చాలామందికి కష్టంగా ఉంటుంది. అలాంటిది చేతులపై నిలబడి హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్ చేయాలంటే ఎంతో శారీరక సామర్థ్యం, పట్టుదల అవసరం. అందులోనూ ముక్కు నేలకు తాకేలా పుష్అప్స్ చేయడం అంటే మరింత కఠినమైన సవాల్. ఆస్ట్రియాకు చెందిన స్టెఫానీ మిల్లింగర్ ఈ అసాధారణ ఫీట్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.
స్టెఫానీ మిల్లింగర్ ఒక్క నిమిషంలో అత్యధిక నోస్-టు-గ్రౌండ్ హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్ చేసిన మహిళగా రికార్డు సాధించారు. కేవలం 60 సెకన్ల వ్యవధిలో ఏకంగా 12 హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్ పూర్తి చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ ఫీట్ కోసం ఆమె చూపించిన బ్యాలెన్స్, బలం, వేగం అందరినీ ఆశ్చర్యపరిచాయి. కఠినమైన సాధనతో అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సాధించిన స్టెఫానీ.. తన అద్భుత ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.
Post Views: 7









