దుమ్ముగూడెం, ఆగస్టు 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని బైరాగులపాడు గ్రామంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన తుర్రం శివాజీ అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో బాధిత మహిళ రెండు కాళ్లు, ఒక చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Post Views: 100








