E-PAPER

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

పలాస టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఆగస్టు 11 (వై7 న్యూస్): పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల సన్నద్ధత, క్షేత్రస్థాయిలో సమన్వయం, ప్రజలతో మరింత మమేకమై పనిచేయాల్సిన అంశాలపై నాయకులతో ఎమ్మెల్యే చర్చించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం” కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజలకు వివరించాలని సూచించారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఐకమత్యంతో, సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!