E-PAPER

భారత్‌లోకి రానున్న Oppo F35 సిరీస్.. భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో ఆకట్టుకోనున్న కొత్త ఫోన్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో భారత మార్కెట్లో కొత్త Oppo F35 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో Oppo F33 సిరీస్‌ను పరిచయం చేసిన కంపెనీ, ఇప్పుడు తదుపరి తరం F35 సిరీస్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో Oppo F35 Pro కూడా ఉండే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నెలలోనే భారత్‌లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉండగా, దీని ధర రూ.40,000 నుంచి రూ.45,000 మధ్య ఉండొచ్చని అంచనా.

నివేదికల ప్రకారం, Oppo F35 Pro ఇటీవల చైనాలో విడుదలైన Oppo A7 Pro Maxకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా భారత మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. అయితే దీనిపై ఒప్పో నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.

భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అధికారికంగా విడుదలైతే, ప్రీమియం మిడ్‌రేంజ్ విభాగంలో ఉన్న ఇతర స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!