E-PAPER

దుమ్ముగూడెం వద్ద 29 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

దుమ్ముగూడెం, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలోని గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం నాటికి గోదావరి నీటిమట్టం 29 అడుగులకు చేరుకుంది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరిలోకి వస్తున్న వరద ప్రవాహం కారణంగా నీటిమట్టం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తున్నారు.

గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!