E-PAPER

ఫ్లాప్ హీరోయిన్లకు లక్కీ స్టార్‌గా మారుతున్న దుల్కర్ సల్మాన్.. ముగ్గురి ఆశలు అతడిపైనే!

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఫ్లాప్‌లతో సతమతమవుతున్న పలువురు హీరోయిన్లకు లక్కీ స్టార్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్‌కు దూరమైన పూజా హెగ్డే మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుండగా, ఆమెకు సాలిడ్ హిట్ అందించే బాధ్యత దుల్కర్‌పైనే పడింది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘శ్రీశ్రీ’తో పూజా టాలీవుడ్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను బలంగా ప్రారంభించాలని చూస్తోంది.

మరోవైపు శృతి హాసన్ కూడా దుల్కర్‌పైనే ఆశలు పెట్టుకుంది. ‘కూలీ’కి మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో తన కెరీర్‌పై క్లారిటీ లేని పరిస్థితుల్లో ఉన్న శృతి.. దుల్కర్ నటిస్తున్న ‘ఆకాశంలో ఓ తార’లో కీలక పాత్ర పోషిస్తోంది. ‘సలార్’ తర్వాత వచ్చిన అవకాశాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో, ఈ సినిమాతో మరోసారి సాలిడ్ సక్సెస్ అందుకోవాలని ఆమె భావిస్తోంది.

ఇక ‘డ్రాగన్’తో వరుస ఆఫర్లు అందుకుంటున్న కయాదు లోహర్ కూడా దుల్కర్ సల్మాన్‌పైనే నమ్మకం పెట్టుకుంది. ‘ఫంకీ’, ‘పల్లిచట్టంబి’ నిరాశపరచగా ‘ఇదయం మురళి’తో విజయం అందుకున్న ఆమె.. ఇప్పుడు మలయాళంలో ‘ఐ యామ్ గేమ్’తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఓనమ్ సందర్భంగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీతో దుల్కర్ మరోసారి హిట్ కొడతాడా? ఈ ముగ్గురు భామల్లో ఎవరికి లక్కీ భాస్కరుడిగా నిలుస్తాడో చూడాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News