E-PAPER

అల్లు అర్జున్ కొత్త కార్పొరేట్ ఆఫీస్.. ‘ICONZAA’తో వ్యాపార విస్తరణకు శ్రీకారం!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ‘ICONZAA’ పేరుతో ఓ ప్రతిష్టాత్మక కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అభిమానులు ప్రేమగా పిలిచే ‘ఐకాన్ స్టార్’ బిరుదుకు అనుగుణంగా ఈ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజైన్, నిర్మాణ పనులను అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఇప్పటికే జూబ్లీ హిల్స్‌లో ‘అల్లు ఎంటర్‌టైన్‌మెంట్’ కార్యాలయం ఉండగా, కొత్త ఆఫీస్ ద్వారా సినిమా నిర్మాణం, ఇతర వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించాలనే ప్రణాళికలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’లో నటిస్తున్నారు. దీపికా పడుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అత్యాధునిక CGI, VFX సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News