గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా లెనోవో కొత్త Legion 27-1R గేమింగ్ మానిటర్‌ను విడుదల చేసింది. 27-అంగుళాల IPS డిస్‌ప్లే, 280Hz రిఫ్రెష్ రేట్, 0.5ms రెస్పాన్స్ టైమ్‌తో పాటు NVIDIA G-SYNC, VESA AdaptiveSync వంటి ప్రీమియం ఫీచర్లను ఈ మానిటర్‌లో అందించింది. తక్కువ ధరలో హై-పర్‌ఫార్మెన్స్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో కంపెనీ దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం Lenovo Legion 27-1R చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. 789 యువాన్ల ధరతో విడుదలైన ఈ మానిటర్ భారత కరెన్సీలో సుమారు రూ.11,000 విలువ ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు JD.com ద్వారా వినియోగదారులు దీనిని కొనుగోలు చేయవచ్చు.
అధిక రిఫ్రెష్ రేట్, వేగవంతమైన రెస్పాన్స్ టైమ్, స్మూత్ విజువల్స్‌ను కోరుకునే గేమర్లకు ఈ మానిటర్ మంచి ఎంపికగా నిలవనుంది. చైనాలో విడుదలైన ఈ మోడల్‌ను త్వరలో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లెనోవో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.








