E-PAPER

రామోజీ ఫిల్మ్ సిటీలో యూరప్ సెట్‌లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ హై వోల్టేజ్ యాక్షన్ షూట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా యూరప్‌ను తలపించే భారీ సెట్‌లో ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ సినిమాలకు యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అదే తరహాలో ‘డ్రాగన్’లో కూడా ప్రేక్షకులను అలరించే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో కొత్త సినీ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘డ్రాగన్’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ నిర్మాణ విలువలు, పవర్‌ఫుల్ యాక్షన్, స్టైలిష్ మేకింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుండగా, ప్రస్తుత షెడ్యూల్ అనంతరం తదుపరి షూటింగ్ వివరాలను చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News