వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోనూ అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రమోషన్ల సందర్భంగా ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ భారీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు వెల్లడించారు.
‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తయిందని, మరో పది రోజుల్లో మొత్తం చిత్రీకరణ ముగుస్తుందని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే విడుదలైన ‘గువ్వల చెరువు ఘాట్’ ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన లభించింది. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధమవుతోంది.
Post Views: 5









