E-PAPER

జీమెయిల్‌కు కొత్త సెక్యూరిటీ ఫీచర్.. సెల్ఫీ వీడియోతోనే అకౌంట్ రికవరీ!

జీమెయిల్ పాస్‌వర్డ్ మరిచిపోయి, రికవరీ కోసం నమోదు చేసిన ఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అందుబాటులో లేని పరిస్థితుల్లో యూజర్లకు సహాయపడేందుకు గూగుల్ కొత్త ‘సెల్ఫీ వీడియో’ సెక్యూరిటీ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చిన్న వీడియోను రికార్డ్ చేసి తమ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సాధారణ సైన్-ఇన్ విధానాలు పనిచేయనప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది.

ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు ముందుగా తమ ఫోన్ సెల్ఫీ కెమెరాతో ఒక చిన్న వీడియోను రికార్డ్ చేయాలి. ఆ వీడియోను గూగుల్ భవిష్యత్ ధృవీకరణ కోసం సురక్షితంగా భద్రపరుస్తుంది. తర్వాత ఎప్పుడైనా పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు లేదా సాధారణ పద్ధతుల్లో లాగిన్ కాలేకపోయినప్పుడు, లైవ్ వీడియో రికార్డ్ చేయాలని గూగుల్ కోరుతుంది. ఆ లైవ్ వీడియోను ముందుగా సేవ్ చేసిన వీడియోతో పోల్చి యూజర్ గుర్తింపును నిర్ధారిస్తుంది.

ఈ ప్రక్రియలో ముందే రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను ఉపయోగించడానికి అవకాశం ఉండదు. కేవలం అప్పటికప్పుడు తీసిన లైవ్ వీడియోనే సిస్టమ్ అంగీకరిస్తుంది. అధునాతన భద్రతా వ్యవస్థలు, బహుళ సెక్యూరిటీ లేయర్లతో పనిచేసే ఈ టెక్నాలజీ డీప్‌ఫేక్ వీడియోలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉండటంతో, అసలైన యూజర్‌కే అకౌంట్ యాక్సెస్ లభించేలా గూగుల్ భద్రతను మరింత బలోపేతం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News