E-PAPER

ఒప్పో K14 సిరీస్ ఫోన్ల ధరలు పెంపు.. రూ. 4,000 వరకు భారము

ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు ఇది ఒక ముఖ్యమైన వార్త. కంపెనీ భారత మార్కెట్‌లో తన ఒప్పో K14 సిరీస్, ఒప్పో A6s ఫోన్ల ధరలను పెంచింది. విడిభాగాల వ్యయం పెరగడం, మెమొరీ చిప్‌ల ధరలు అధికమవ్వడం, సరఫరా వ్యవస్థలో తలెత్తిన సవాళ్ల కారణంగా కొన్ని మోడళ్లపై రూ. 4,000 వరకు ధరలు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ కొత్త ధరలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఒప్పో K14 సిరీస్‌లోని 6GB + 128GB మోడల్ ధర రూ. 19,999 నుంచి రూ. 21,999కి చేరగా, 6GB + 256GB వేరియంట్ రూ. 21,999 నుంచి రూ. 24,999కి పెరిగింది.

అత్యధికంగా 8GB + 256GB టాప్ మోడల్ ధర రూ. 23,999 నుంచి ఏకంగా రూ. 27,999కి పెరిగి, రూ. 4,000 మేర ప్రియమైంది. ఈ ధరల పెంపుతో ఒప్పో K14 సిరీస్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఇప్పుడు మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News