E-PAPER

కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం

పలాస, జూలై 10 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం, కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ఎదురుగా ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News