E-PAPER

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, జూలై 10 (వై7 న్యూస్): పలాస-కాశీబుగ్గ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్ సమస్యలు, జంగిల్ క్లియరెన్స్ రోడ్లు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 34 వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి వినతిని ఎమ్మెల్యే శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. ప్రజల సహకారం, సూచనలతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News