తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్పై మరోసారి జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. రజనీకాంత్ తన 175వ చిత్రం పూర్తయ్యాక నటనకు శాశ్వతంగా వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల దళపతి విజయ్ కూడా రాజకీయాల కోసం సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించడంతో, ఇప్పుడు రజనీకాంత్ పేరూ వినిపించడం మరింత చర్చనీయాంశంగా మారింది.
అయితే, రజనీకాంత్ రిటైర్మెంట్పై ఇలాంటి ప్రచారం రావడం కొత్త విషయం కాదు. గతంలో కూడా పలు సినిమాల సమయంలో ఇదే తరహా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ప్రతిసారీ అవి కేవలం ఊహాగానాలుగానే మిగిలాయి. ఈసారి కూడా 175వ సినిమా తర్వాత రిటైర్మెంట్పై రజనీకాంత్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం రజనీకాంత్ తన 173వ చిత్రం ‘ధర్మన్’ షూటింగ్లో బిజీగా ఉండగా, మరోవైపు ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు లేవు. సూపర్ స్టార్ భవిష్యత్ నిర్ణయంపై స్పష్టత రావాలంటే ఆయన అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









