E-PAPER

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా సర్కార్ సీరియస్.. జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

 

హెచ్-1బీ వీసా మోసాలు, దుర్వినియోగంపై అమెరికా ఫెడరల్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికాలో ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే” అని స్పష్టం చేసిన ఆయన.. వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మిల్వాకీలోని ఎయిర్ నేషనల్ గార్డ్ రిఫ్యూలింగ్ బేస్‌ను సందర్శించిన సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు సంబంధించిన అక్రమాలపై ప్రత్యేక ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ విస్తృత దర్యాప్తు చేస్తోందన్నారు. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని, వీసా వ్యవస్థను మోసగాళ్లు దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావడంలో హెచ్-1బీ వీసా కీలక పాత్ర పోషించిందని జేడీ వాన్స్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కొందరు పెద్ద కార్పొరేట్ సంస్థలు, అక్రమాలకు పాల్పడుతున్న వర్గాలు ఈ వీసా విధానాన్ని దుర్వినియోగం చేసి అమెరికన్ ఉద్యోగుల వేతనాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News