అశ్వాపురం, జూలై 7 (వై7 న్యూస్):
తెలంగాణ గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమితులైన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు అశ్వాపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్, మాజీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకుడు వేములపల్లి రమేష్‌తో పాటు తిరుమలగూడెం, అమెర్ధ, సండ్రలబోరు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గిరిజనుల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాయం అభిమానులు పాల్గొన్నారు.
Post Views: 20









