అశ్వాపురం, జూలై 7 (వై7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని జగజీవన్‌రామ్ కాలనీ (ఎస్సీ కాలనీ)లో మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు ఇసంపల్లి కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఇసంపల్లి కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మంద కృష్ణ మాదిగ అలుపెరుగని పోరాట యోధుడని, బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పేదల పక్షాన నిలిచారని కొనియాడారు.
అనంతరం ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు ఇసంపల్లి కృష్ణ మాదిగ దండోరా జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మిరియాల వెంకటేశ్వర్లు, చుంచు రామ్మూర్తి, గద్దల రామకృష్ణ, గురుజాల శ్రీనివాస్, కొమ్ము రాంబాబు, గద్దల శ్రీనివాస్, గురజాల కృష్ణ, మిర్యాల బాలకృష్ణ, అలవాల రమేష్, మురికిపూడి అశోక్, శెట్టిపల్లి భాస్కర్, నల్లగట్ల వెంకన్న, సుంచు సందీప్, గద్దల అనిల్, నల్లగట్ల ప్రశాంత్, గురజాల రామ్‌కిరణ్, కత్తి కృష్ణ, సుంచు సాయి తదితరులు పాల్గొన్నారు.









