పినపాక
మణుగూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న శ్రీవిద్య జూనియర్ కళాశాలలో గురువారం యాంటీ-డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమానికి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్, కళాశాల ప్రిన్సిపాల్ నిరోషా, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.
Post Views: 11








