హైదరాబాద్ ;
హైదరాబాద్‌లోని రామంతాపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘానికి చెందిన ప్రముఖ నాయకుడు చిటికెల కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి ఈ నియామకాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ పిలుపు మేరకు సాగరహారం, సకల జనుల సమ్మె, వంటా-వార్పు వంటి ఉద్యమ కార్యక్రమాల్లో రామంతాపూర్ వంశరాజ్ కులస్తులు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పదవి ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రామంతాపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చిటికెల కృష్ణయ్య కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Post Views: 9








