E-PAPER

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల ఫెడరేషన్ (TWJF) ఖమ్మం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహణ

వై7 న్యూస్ | ఖమ్మం

ఖమ్మం: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి TWJF వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య అధ్యక్షత వహించారు.
సమావేశంలో జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు, వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, జర్నలిస్టుల బాధ్యతలు, వృత్తి నైతిక విలువలు, అలాగే వారికి అందాల్సిన సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చించారు. జర్నలిస్టుల హక్కులను కాపాడడం, వారి సంక్షేమాన్ని మెరుగుపరచడం కోసం సంఘం కృషి చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నాగేష్, కోశాధికారి వేములకొండ రమేష్ కుమార్ పాల్గొన్నారు. అలాగే మహిళా జర్నలిస్టులు స్వాతి, జ్యోతి సహా పలువురు జర్నలిస్టులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News