భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
బూర్గంపాడు మండలం జింకలగూడెంలో ఐటీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు రూ.9 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బస్సు షెల్టర్‌ను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు.
ఈ బస్సు షెల్టర్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా ప్రయాణికులకు వర్షం, ఎండ నుండి రక్షణతో పాటు సౌకర్యవంతమైన వేచి ఉండే వేదిక అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, ఎంపీడీవో జమలారెడ్డి, ఐటిసి పిఎస్పీడీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చెంగల్ రావు, స్థానిక సర్పంచ్ బొర్రా సుభద్ర, అంజనాపురం సర్పంచ్ బానోత్ నరసింహ, పినపాక పట్టినగర్ సర్పంచ్ బానోత్ పద్మ, మొరంపల్లి బంజర మాజీ ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, షేక్ షరీఫ్, సయ్యత్ సమీర్, షేక్ అబ్దుల్లా, షేక్ షబ్బీర్, షేక్ గులాం, సయ్యద్ రియాజ్, సయ్యద్ అమీర్, చిన్న మదర్ తదితరులు పాల్గొన్నారు.








