అశ్వాపురం: మండలంలోని మొండికుంట ప్రాంతంలో కేవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో వర్షం, బలమైన గాలుల ప్రభావంతో ఓ భారీ చెట్టు రోడ్డుపై కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రోడ్డుమధ్యలో చెట్టు పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని చెట్టును తొలగించే పనులు ప్రారంభించారు. త్వరలోనే రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలిపారు.
Post Views: 29








