మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఉగాది పండుగ సందర్భంగా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పూలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు కృష్ణవేణి, సీనియర్ నాయకులు పోలమూరి రాజు, దొబ్బల వెంకటప్పయ్య, కాటబోయిన నాగేశ్వరావు, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, ఎస్ గణేష్ రెడ్డి, అబ్దుల్లా, రామ సుబ్రహ్మణ్యం, భాగం రవి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17








