వై7 న్యూస్ పలాస
ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని పలాసలోని ప్రజా సదన్‌లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయనకు మొక్కలు అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరభావ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నెలకొని, ప్రతి కుటుంబం ఆనందంతో ఉండాలని సిదిరి అప్పలరాజు ఆకాంక్షించారు.
పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 27








