వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలలో మణుగూరు కీలక పాత్ర పోషిస్తుంది..
ఆపరేషన్ కగార్ పేరుతో ఖనిజ దోపిడీకి పాల్పడుతుంది..
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య..
పరిశ్రమల పరిరక్షణ, ఉద్యోగుల అవకాశాలకై మిలిటెంట్ ఉద్యమాలు..
సిఐటియు జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి
మణుగూరు: నేడు రేపు జరగబోయే సిఐటియు4వ జిల్లా మహాసభలు మణుగూరు మండలం కిన్నెర కళ్యాణ మండపంలో జరుగుతున్నాయని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలు, కార్యచరణ రూపొందించేందుకే మహాసభలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య అన్నారు శనివారం స్థానిక శ్రామిక భవనంలో సిఐటియు జిల్లా నాయకులు సత్ర పల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజల సహకారంతో మహాసభలు నిర్వహించబడుతున్నాయి అన్నారు అమరజీవి కూకట్ల శంకర్ నగర్ లో ఎర్ర శ్రీకాంత్ ప్రాంగణంలో మహాసభలు నిర్వహించ బడతాయని అన్నారు మణుగూరు ప్రజలు వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలకు చేయూత అందిస్తారని అన్నారు ఈ మహాసభలో తీసుకొనే కర్తవ్యాలు, నిర్ణయాలను ఉద్యమాల రూపకల్పన చేస్తుందని అన్నారు ఈ ప్రాంతంలో 1978 నుండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మణుగూరులో సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించినదని అన్నారు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమస్యలతో ఉన్నారని తెలిపారు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్మికులను బానిసలు చేసే నాలుగు కార్మిక కోడులను అమలు చేసిందన్నారు అనేక కార్మిక సమ్మెలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం నిరంకుషత్వంగా కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు 2020 నుండి 2025 వరకు కార్మికులు, ప్రజలు 9 జాతీయ సమ్మెలు నిర్వహించారని తెలిపారు రైతాంగానికి నష్టపరిచే మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 1921లో తీవ్ర ప్రతిఘటన చేశారని తెలిపారు కరోనా సమయంలో వర్షానికి, చలికి తట్టుకొని కార్మికులు 360 రోజులు రహదారులు దిగ్బంధనం చేశారని అన్నారు ఈ పోరాటంలో 800 మంది రైతులు చనిపోయారని అన్నారు ఈ సందర్భంగా వెనుక తగ్గిన మోడీ ప్రభుత్వం మళ్లీ దొడ్డి దారిన నల్ల చట్టాల అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు మధ్య భారత దేశంలో ఖనిజ సంపాదన కార్పొరేట్ సంస్థలైన ఆదాని, అంబానీలకు దోచి పెట్టేందుకే ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు నిర్వహిస్తున్నారని అన్నారు
పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి
అపారమైన ఖనిజ సంపద ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా మహాసభలలో కార్యచరణ రూపొందిస్తామన్నారు ఈ మహాసభలకు సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్,రాష్ట్ర కార్యదర్శి మధు ఈ మహాసభలలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు 38 సిఐటియు అనుబంధ రంగాల నుండి 23 మండలాల నుండి 500 మంది ప్రతినిధులుఈ మహాసభలలో పాల్గొంటున్నారని తెలిపారు పారిశ్రామిక జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో ఏఎస్ఐ ఆసుపత్రి నెలకొల్పాలని డిమాండ్ చేశారు జిల్లాలో పదివేల ఈఎస్ఐ కార్డులు ఉన్నాయని అన్నారు ఇటీవల సింగరేణిలో సిఐటియు పోరాట ఫలితంగా ఈఎస్ఐ సౌకర్యం కాంట్రాక్ట్ కార్మికులకు సాధించారని తెలిపారు సింగరేణి ప్రభుత్వ సహకారంతో జిల్లాలో ఆధునిక ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు జిల్లాలో మూతబడిన ఎన్ఎండిసి తెరిపించాలని, కేటీపీఎస్ రెండు యూనిట్లు విస్తరించి యువతకు ఉపాధి కల్పించాలన్నారు ఖనిజాలను వినియోగం లోకి తేవాలని మహాసభలో చర్చి ఉంటుందన్నారు సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు సింగరేణి లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ఊహించుకోలేమన్నారు పరిశ్రమల కెపాసిటీ తగ్గిస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, ఆశా వర్కర్లు, అంగన్వాడి మిడ్ డే మీల్స్ కార్మికులు, గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేసే కార్మికులకు వేతనం అమలు చేసే వరకు మిల్టెంట్ పోరాటాలు నిర్వహిస్తామన్నారు ప్రజల మద్దతుతో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు జిల్లా మహాసభ కార్యచరణ నిర్వహిస్తామన్నారు ఈ ప్రాంతంలో కార్మికులు ప్రజల సహకారంతో సిఐటియు , సిపిఎం ఆతిథ్య ఇస్తున్నారని అన్నారు మహాసభ జయప్రదం కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాబోయే కాలంలో మూడు సంవత్సరాలు ఉద్యమాలు నిర్వహించేందుకు ఈ మహాసభలు శక్తినిస్తాయని అని తెలిపారు
కార్మికులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందుకే సి అండ్ ఎం డి ప్రకటన
సిఐటియు సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు
కార్మికులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకే సింగరేణి సి అండ్ ఎం డి బలరాం నాయక్ మణుగూరు లో సింగరేణికి భవిష్యత్తు లేదనే ప్రకటన ఆ వాస్తవం అన్నారు 1974 ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సింగరేణి శంకుస్థాపన సమయంలో 100 సంవత్సరాలు వెలికి తీసే అంత బొగ్గు మణుగూరు ప్రాంతంలో ఉన్నదని ఆనాడు ఆయన తెలిపారని అన్నారు ఎందరో సి అండ్ ఎండి లు ఇలాంటి ప్రకటనలు చేశారని తెలిపారు మణుగూరుకు భవిష్యత్తు ఉన్నదని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కొడిశాల రాములు జిల్లా నాయకులు ఉపతల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు









