వై సెవెన్ తెలుగు న్యూస్ – నవంబర్ 14
జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్
అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట, రజబలినగర్ పాఠశాలలను జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్ పరిశీలించారు. జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల్లో పాల్గొన్నారు.
తల్లిదండ్రులు విధిగా సమావేశాలకు హాజరై విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవాలని సూచించారు. అనంతరం రాజబలినగర్ గుతికోయ ఆవాస ప్రాంతంలోని మండల పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కేక్ కట్ చేశారు.
విద్యార్థులకు డ్రాయింగ్ పుస్తకాలు,రంగు పెన్సిళ్లు, లైబ్రరీ పుస్తకాల పంపిణీ చేశారు.
“విద్యార్థులు పుస్తకాలు బాగా చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలి” అని నాగరాజ శేఖర్ పిలుపునిచ్చారు.
మండలంలోని అనేక పాఠశాల్లో స్వయం పాలనా దినోత్సవం నిర్వహించారని మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనందకుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, లకవాత్ జయరాం, ఆవాస నివాసి మహేష్ తదితరులు పాల్గొన్నారు.









