E-PAPER

దివ్యాంగుల సంఘం నాయకుడు నర్సింలు మృతి తీరని లోటు

దివ్యాంగ మహాసమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ చారి

మెదక్ జిల్లా నార్సింగి నవంబర్ 13

మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన ర్యాల నర్సింలు (50) గుండె పోటుతో అకాల మరణం చెందారు.సోమవారం గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు కొంపల్లి సమీపంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం హుటాహుటిన తీసుకెళ్లి అడ్మిట్ చేయగా గురువారం నాడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడికి భార్య కూతురు,కుమారులు ఉన్నారు.నర్సింలు జిల్లా దివ్యాంగుల సంఘం నాయకులుగా సేవలందిస్తూ….ఇటీవల పెన్షన్లు పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో ఉమ్మడి చిన్న శంకరంపేట నార్సింగి మండలాల్లో చురుకుగా పాల్గొన్నారు.కాగా నర్సింలు అకాల మరణం తీరని లోటని జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు పాండు అలాగే రాష్ట్ర దివ్యాంగ మహా సమితి కార్యదర్శి శ్రీనివాస్ చారి ఎన్పీఆర్డీ ప్రతినిధి అడివయ్య రాష్ట్ర జిల్లా దివ్యాంగ సంఘం నాయకులు దేవరాజు జగ్గారి నర్సింలు మండల జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News