E-PAPER

రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న పినపాక రైతులు

జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు

పినపాక

పినపాక మండలంలోని రైతులు సాంకేతిక సలహాలను అనుసరించి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో మంచి ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు అన్నారు. శుక్రవారం ఆయన పినపాక మండలంలో ఏఈఓ రమేష్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం పథకంలో భాగంగా పినపాక గ్రామానికి చెందిన రైతు శ్రీ ఎల్లు సతిరెడ్డి డబ్ల్యూజిఎల్-44 (సిద్ది) రకం వరి వంగడం సాగు చేశారన్నారు.ఈ రకం పంట ఈ సీజన్‌లో వచ్చిన అధిక వర్షాలు, కంకి నల్లి, మెడ విరుపు, ఆకుముడత వంటి తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని, మిగతా వంగడాల కంటే అధిక దిగుబడి ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా రైతు సతిరెడ్డి మాట్లాడుతూ ఈ రకం ద్వారా ఎకరాకు 48 బస్తాల వరకు దిగుబడి వచ్చిందన్నారు. తెగుళ్లు ఉన్నప్పటికీ పంట బాగా పండిందని. ఈ ధాన్యాన్ని కుటుంబ వినియోగం కోసం వాడుకుంటానని
అని సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే సీతంపేట గ్రామానికి చెందిన సాల్వేరు రఘుపతి రావు కూడా వ్యవసాయ శాఖ సూచన మేరకు అదే రకం వంగడాన్ని కరివేద విధానంలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు.గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఆయన మాట్లాడుతూ ఇంత చక్కగా పంట ఎప్పుడూ చూడలేదన్నారు. తెగుళ్లు వచ్చినా పంట బలంగా నిలిచిందని. మంచి కంకులు వచ్చాయని, బెరుకులు లేవని తెలిపారు.వచ్చే వానాకాలంలో తోటి రైతులకు ఈ విత్తనాలను స్వయంగా సరఫరా చేయాలనుకుంటున్నానని
అని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News