ఇసుక కోసం మళ్లీ గ్రామం గుర్తొచ్చిందా ?
ఆదివాసీ సమాజాన్ని ,ఏజన్సీ చట్టాలను మోసం చేస్తున్నారు ..
గుండ్ల సింగారం ర్యాంపుపై విచారణ జరిపించాలి.
రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు
పూనెం సరోజ
మణుగూరు
ఇసుక ర్యాపులకోసం ప్రస్తుతం లేని గ్రామాలను తెరపైకి తీసుకువచ్చి ఆదివాసీ సమాజాన్ని,ఏజెన్సీ చట్టాలను మోసం చేస్తున్నారని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ డిమాండ్ చేశారు. మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే గ్రామం 20 సంవత్సరాల క్రితమే సింగరేణి ఓసి ల క్రింద తీసుకుని భూ నిర్వాసితులకు ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ రోజు గుండ్ల సింగారం పేరుతో ఊరు లేని చోట ఊరు పేరు చెప్పుకుoటూ కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను భారీ యంత్రాలతో డంపింగ్ చేసారన్నారు.దానికి టీ.జి. ఎండిసి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందని ప్రశ్నించారు. అమైండ్మెంట్ యాక్ట్ , పీసా చట్టం ప్రకారంగా ఆ గ్రామాన్ని సందర్శించారా అన్నారు.పీసా గ్రామ సభ పెట్టరా అని రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు అన్నారు. ఇట్టి ఇసుక ర్యాంపు పై అధికారులు ఏ రకంగా సంతకం పెట్టారని. మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎలా సంతకాలు చేసి పర్మిషన్ లు ఇచ్చారన్నారు. ఈ ఊరును మాకు చూపెట్టాలని డిమాండ్ చేసారు. లేనిచో సర్వే భవన్ నుండి మ్యాప్ లు తెప్పించి అధికారులపై హై కోర్టు లో కేసులు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు, సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎండి షబానా, కోరి శ్యామల ,డేరంగుల సుజాత, కన్నాపురం వసంత, కన్నాపురం శైలజ ,రెడ్డి బోయిన రేణుక మరియు సౌజన్య డాకూరి పాల్గొన్నారు..









