ములుగు, నవంబర్ 4, : మల్లంపల్లి మండల సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జాతీయ రహదారి (ఎన్హెచ్) బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా బుధవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహదారి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నేషనల్ హైవే ఏఈ చైతన్య తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున, ములుగు నుండి హనుమకొండకు వెళ్లే భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా, చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలని, హనుమకొండ నుండి ములుగుకు వచ్చే భారీ వాహనాలు పరకాల మీదుగా, చిన్న వాహనాలు శ్రీనగర్–భూపాల్ నగర్ మీదుగా రావాలని సూచించారు. వాహనదారులు నిర్మాణ పనులకు సహకరించాలని ఏఈ చైతన్య విజ్ఞప్తి చేశారు.
Post Views: 67









