భద్రాద్రి కొత్తగూడెం:
జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, కార్యదర్శి కరుణకుమారి మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఇంకా అనేక మౌలిక సదుపాయాలు అవసరమని, పలు మండలాల్లో ఉన్న గ్రామీణ గ్రంథాలయాలకు స్థల సేకరణ అత్యవసరమని వివరించారు. గ్రంథాలయాల అభివృద్ధి ద్వారా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పాఠకులకు విస్తృత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఈ వినతిని సానుకూలంగా స్వీకరించి, గ్రంథాలయాల మౌలిక సదుపాయాల కోసం తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇన్‌చార్జ్ నవీన్ కుమార్, సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 42









