కొత్తగూడెం:
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మేదరబస్తికి చెందిన మహిళ దుర్మరణం చెందింది.
వివరాల్లోకి వెళ్తే ఆర్టీసీ బస్సు ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 352









