E-PAPER

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విద్యార్థుల భిక్షాటన

కరకగూడెం మండలం | నవంబర్ 1 (Y7 NEWS)

పేద విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

8000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్‌ను తక్షణం విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్

కరకగూడెం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలో విద్యార్థులు వినూత్నంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాదాస్ అఖిల్ మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులు చదువుకుంటున్న కాలేజీల్లో 8 వేల కోట్లకు పైగా స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నా, ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఫలితంగా అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్ఎఫ్ఐ తరపున అనేక పోరాటాలు చేసి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించడంలేదు. విద్యార్థులు 31వ తేదీన బంద్ నిర్వహించగా, దానిపై విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించడం అత్యంత దుర్మార్గం అని విమర్శించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ఎవరికీ ఆసక్తి లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. వెంటనే బకాయి స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. లేనిపక్షంలో ఎమ్మెల్యేల ఇళ్లు, మంత్రుల ఇళ్లు, అలాగే ఐటీడీఏ పీఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి సిద్ధమవుతాం,” అని హెచ్చరించారు.

ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం సరికాదు. తక్షణమే సర్టిఫికెట్లు ఇవ్వకపోతే, సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News