E-PAPER

నువ్వలరేవు అప్రోచ్ రోడ్డుకు త్వరలో మోక్షం

అధికాకరులతో ఎమ్మెల్యే సమీక్ష

పలాస :
వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవు, మంచినీళ్ళపేట బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష నేత్రుత్వంలో మోక్షం లభించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. టీడీపీ హయాంలో ఆ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలను దూరం చేసేందుకు అప్పటి ఎమ్మెల్యే, తన తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ కృషి చేశారన్నారు. ఈ నేపథ్యంలో మంచినీళ్ళపేట గ్రామం వైపు అప్రోచ్ రోడ్డు పూర్తయ్యిందన్నారు. ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆ పనులను నీరు గార్చి, ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. అయితే అభ్యంతరంగా నిలిచిన ఆ పనులను పూర్తిచేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అప్రోచ్ రోడ్డు నిర్మాణం, నిర్వాసితుల సమస్యలు, ప్రత్యామ్నాయం, పరిహారం తదితర అంశాలపై చర్చించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News