E-PAPER

సహచరుల పట్ల మానవత్వం చూపిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్స్

మణుగూరు, అక్టోబర్ 13:
సహచరుల పట్ల సానుభూతితో నిలిచిన సింగరేణి ఎస్ & పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, తమ సహోద్యోగుల కుటుంబాల ఆపదలో ఆర్థిక సహాయం అందించారు. తల్లిదండ్రులను కోల్పోయిన మూడు కుటుంబాలకు గార్డ్స్ అందరూ కలిసి మొత్తం రూ.66,600 అందజేశారు.ఎం. రాజనర్సు, ఎం. విశ్వేశ్వరరావు, బి. రమేష్ బాబు కుటుంబాలకు వరుసగా రూ.16,900, రూ.16,900, రూ.32,800 అందించారు.తమ తక్కువ వేతనాల్లోనూ సహచరుల పట్ల చూపిన ఈ మానవీయ చర్య సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News