పలాస, సెప్టెంబర్ 19 వై 7 న్యూస్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, జిల్లా ఎస్‌పి కె.వి. మహేశ్వర రెడ్డి స్వయంగా అర్జీలు స్వీకరించారు.
ప్రజల నుండి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఎస్‌పి తెలిపారు. ప్రజల న్యాయసంబంధ సమస్యలు ఆలస్యం లేకుండా పరిష్కరించబడేలా కృషి చేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
Post Views: 68









