పినపాక సెప్టెంబర్ 19 వై 7 న్యూస్;
పినపాక మండలం, తోగ్గూడెం గ్రామపంచాయతీ నూతన సెక్రటరీగా పోలెబోయిన సంధ్యారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దుగినేపల్లి సెక్రటరీగా విధులు నిర్వహించిన సంధ్యారాణి బదిలీల్లో భాగంగా తోగ్గూడెం గ్రామపంచాయతీకి వచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి లిఖితపూర్వకంగా , లేదా ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరారు. తన పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.
Post Views: 112









