E-PAPER

మొదటి సారిగా టూర్ ప్యాకేజీ లో భాగంగా ఆర్టీసీ మెదక్ బస్ డిపో తరఫున డీలక్స్ బస్సు రహమతబాద్

మెదక్ ఆగస్టు 2 వై 7 న్యూస్

14 aug నుండి 16 ఆగస్టు వరకు వెళ్ళుచున్నదని బస్ డిపో మేనేజర్ సురేఖ సింగిడి ప్రతినిధి గౌస్,తోమాట్లాడుతూ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 ఆగస్టు గురువారం నాడు ఉదయం ఐదు గంటలకు మెదక్ నుండి నాగార్జునసాగర్ , నెల్లూరు బారా షాహిద్ దర్గా , రహమత బాద్ దర్గా , కిస్వా మోర్ దర్గా , కడప దర్గా వెళ్తుందని తెలిపారు. ఈ డీలక్స్ బస్సులో 39 సీట్లు ఉండగా ఇప్పటికే 21 సీట్లు రిజర్వు పూర్తి చేసుకున్నాయి అని తెలిపారు. మిగతా సీట్ల కొరకు ఆసక్తి గలవారు బుక్ చేసుకోవాలని కోరారు. ఈ బస్సులో పెద్దలకు 2500/- , చిన్నపిల్లలకు 1400 /- వందల రూపాయలు ఛార్జ్ ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు 9440971637 సంప్రదించవచ్చు అని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ వీరబాబు , ఎజాజ్ అలీ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్