E-PAPER

బీసీల రిజర్వేషన్లపై చారిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ నాయకుడు గురజాల గోపి హర్షం

మణుగూరు, జూలై 11 (వై 7న్యూస్ తెలుగు):

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గురజాల గోపి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, “ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ద్వారా ఇచ్చిన హామీకి ఇది నిధర్శనం. బీసీలకు రాజకీయ స్థాయిలో న్యాయం చేసే దిశగా ఇదొక మైలురాయి. దేశ రాజకీయ చరిత్రలోనే ఇటువంటి నిర్ణయం అపూర్వమైనది,” అని పేర్కొన్నారు.

బీసీల హక్కులకు గౌరవం ఇచ్చినందుకు, తమ మాట నిలబెట్టుకున్నందుకు AICC అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు గోపి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :