తూప్రాన్ జూన్13 వై 7 న్యూస్
ఎఫ్డీసీ మాజీ ఛైర్మన్, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను మాల్కాపూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిన్న రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామి వేద పండితులు రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిన్న రాజు మాట్లాడుతూ ప్రతాప్ అన్న నిన్ను నూరేళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మనోహరాబాద్ మాజీ ఎంపీపీ పురం నవనీత రవి, మాల్కాపూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిన్న రాజు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ వేద పండితులు రాహుల్, లింగారెడ్డి పేట్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, జింక నవీన్, నర్సింలు, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 44









