E-PAPER

ఈ ప్రభుత్వానికి రైతు గోస పట్టదా.?మాజీ సర్పంచ్ మల్లారెడ్డి

బిజీ కొత్తూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ సర్పంచ్ మల్లారెడ్డి.

రైతులను పట్టించుకోండి మహా ప్రభో.

అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్న రైతు.

ఎన్నాళ్ళు వేచి ఉండాలి నిద్రాహారాలు మాని రైతులు కల్లాల దగ్గర.

అశ్వాపురం, మే 14 వై సెవెన్ న్యూస్;

అశ్వాపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నెల్లిపాక పరిధిలో ధాన్యం మొత్తం ఆరు సెంటర్లలో కాటాలు బెట్టి 20,000 బస్తాలు రైతులు సొంత ఖర్చులతో లాట్లు వేసుకొని లారీల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతులు. ధాన్యం కాటాలు పెట్టినయి గాక ఇంకా ఈ ఆరు సెంటర్లలో ఇంకా కాటా పెట్టవలసిన ధాన్యం 20వేల బస్తాలు ఉన్నాయి.ఇందులో అధికంగా ఆనందపురం సెంటర్లలో రైతుల ధాన్యం కాటబెట్టవలసినది. ధాన్యం సెంటర్లు ప్రారంభించినాటి నుండి గన్ని సంచుల మొదలుకొని దాన్యకాటబెట్టుడు లారీల ట్రాన్స్పోర్ట్ అన్ని విభాగాలలో ప్రభుత్వ అధికారులు విఫలమై రైతులను పట్టించుకునే నాధుడు లేడు. అధికారులు ఇప్పటికైనా నిద్రలేచి యుద్ధ ప్రాతిపదికన రైతులు ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నాం…అలాగే గన్ని బ్యాగులు తెప్పించి మిగతా ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నట్లు తెలిపా .

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News