E-PAPER

వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ అవార్డు పొందిన తొలి భారత బాలల హక్కుల ఉద్యమకర్త భువన్ రిభు

భద్రాద్రి కొత్తగూడెం, మే 07

జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే దేశవ్యాప్త నెట్వర్క్ స్థాపించి బాలల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న భువన్ రిభు ని వరల్డ్ టూరిస్ట్ అసోసియేషన్ గుర్తించి మెడల్ ఆఫ్ హానర్ అవార్డుతో సత్కరించిందని జస్ట్ రైట్స్ చిల్డ్రన్ నెట్వర్క్ లో భాగస్వామి అయిన యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాద్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు
వరల్డ్ టూరిస్ట్ అసోసియేషన్ ద్వారా సత్కరించబడిన తొలి భారతీయ న్యాయవాది బాలల హక్కుల ఉద్యమకర్త భువన్ రివ్యూ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ విధంగా భద్రాద్రి కొత్తగూడెంజిల్లా పిల్లల రక్షణలో ఆయన దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ భాగస్వామిగా ఉన్న యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా గత మూడు సంవత్సరాలుగా బాల్యవివాహాలు బాలల అక్రమ రవాణాను నిరోధించడానికి కృషి చేస్తుందని తెలిపారు
ఈ అవార్డు రావడం భారతదేశంలో బాలల హక్కుల పరిరక్షణలో మరొక మైలురాయి అని 2030 నాటికి బాలివివాహాలు లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను సాధించడానికి తమకు ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.

వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన న్యాయ నిపుణుల సంఘం అని 1963లో స్థాపించబడినప్పటి నుంచి వివిధ ప్రముఖులు అయిన సర్ విన్స్టల్ చర్చిల్ నెల్సన్ మండేలా రూత్ బార్డర్ గిన్స్బర్గ్ స్పెయిన్ రాజు ఫెలిఫే VI రేణి కాసిం మరియు కెర్రీ కెనడి వంటి దిగ్గజ వ్యక్తులు చేసిన కృషికి ఈ అవార్డు పొందారని వారి సరసన ఒక భారతీయుడు భవన్ రిభు చేరడం గర్వకారణం అని కొనియాడారు
ఇది భవన్ రివ్యూ కి వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు భారతదేశంలో ప్రతి బిడ్డను రక్షించడానికి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న మనందరికీ అపారమైన గర్వకారణం అని అన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పరిపాలన మద్దతుతో 2030 నాటికి బాల్యవివాహాల రహిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రూపొందించడానికి మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు
అవార్డు ప్రధానం చేసే సందర్భంలో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు జేవియర్ క్రమడేస్ మాట్లాడుతూ న్యాయం ప్రజాస్వామ్యమైన బలమైన స్తంభమని భవన్ రిబుబ్ దృఢంగా విశ్వసిస్తాడు మరియు తన దేశంలోని అలాగే ప్రపంచంలోనే పిల్లల కొరకు మరియు మహిళల కొరకు నిరంతరం తన జీవితాన్ని అంకితం చేశాడు తన ప్రయత్నాల ద్వారా లక్షలాదిమంది పిల్లలు మరియు మహిళల యొక్క హక్కులు రక్షించబడ్డాయి భవిష్యత్ తరాలకు రక్షించే చట్టపరమైన ఏర్పాట్లు చేయడం ద్వారా అయినా అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకి అర్హుడు అన్నారు
ఈ కార్యక్రమంలో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరిప్రసాదరావు కోఆర్డినేటర్ వి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News