కరకగూడెం,16 వై సెవెన్ న్యూస్
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ,
రాహుల్ గాంధీ కులం ఏమిటి అని అడుగుతున్న బిజెపి పార్టీ వారు ముందు దేశంలో కులగణన చేపట్టి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి వారి కులం అడగాలని అన్నారు. రాహుల్ గాంధీ నానమ్మ,తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహా నేతల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని ,ఆయన కులం ఏమిటి అని మీకు తెలవదు అనుకుంటే ముందుగా మీ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడినీ అడగండి అని తెలిపారు. రాహుల్ గాంధీ కుటుంబం పై బిజెపి నాయకులు విషం చిమ్మే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైన బిజెపి నాయకులు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
Post Views: 125









