E-PAPER

బాస్కెట్బాల్ మెన్ అండ్ ఉమెన్ టీం కి కిట్ల పంపిణీ

వై 7 ప్రతినిధి (కాకినాడ జిల్లా):

కాకినాడ జిల్లా, పెదపూడి మండలం,గొల్లల మామిడాడ జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గొల్లల మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఉమెన్ జిల్లా జట్టుకు శిక్షణ శిబిరం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లలమామిడాడ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ క్రీడాకారుడు తమలంపూడి శివరామరెడ్డి సౌజన్యంతో మెన్ మరియు ఉమెన్ రెండు టీములకు బాస్కెట్బాల్ కిట్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.చక్రవర్తి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మాణిక్యాలరావు పాల్గొన్నారు. మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గొలుగూరి గౌరీ శంకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తమలంపూడి శివరామరెడ్డి నేతృత్వంలో మెన్ మరియు ఉమెన్ రెండు టీములకు కిట్లను అందజేయడం జరిగింది. గత మూడు రోజులుగా ఉమెన్ బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం గొల్లల మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉమన్ టీమ్ కి కోచ్ గా జడ్పీ హైస్కూల్ పీడీ ఐ. గోపాలకృష్ణ తర్ఫీదునిచ్చారు ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులను వసతి భోజన ఏర్పాట్లను మామిడాడ బాస్కెట్బాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరామరెడ్డి మాట్లాడుతూ గొల్లలమామిడాడ క్రీడలకు పుట్టినిల్లు అని క్రీడాకారులకు గొల్లలమామిడాడలో ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కి రాష్ట్రస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని వారు ఆశీస్సులను అందజేశారు. కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కే శ్రీనివాస్ మామిడాడ బాస్కెట్బాల్ కార్యదర్శి చిర్ల వెంకటకృష్ణారెడ్డి, కోశాధికారి ద్వారంపూడి యువ రాజారెడ్డి, అప్పారెడ్డి, బుల్లి గంగిరెడ్డి, సూరారెడ్డి, సబ్బళ్ళ కృష్ణారెడ్డి, పప్పు శ్రీనివాస రెడ్డి, తాడి వీర రాఘవరెడ్డి, మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు బాస్కెట్బాల్ క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News