. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కడిగిన ముత్యం
. బిజెపి తగిన మూల్యం చెల్లించుకుంటుంది
. పొంగులేటి వీరాభిమాని ఉడుముల రవీందర్ రెడ్డి
పినపాక, సెప్టెంబర్ 28 వై7 న్యూస్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడులు బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ నాయకులు పొంగులేటి వీరాభిమాని ఉడుముల రవీందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శనివారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారంలో మీడియా తో మాట్లాడారు.వారు మాట్లాడుతూ,ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర అని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోందన్నారు.రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ప్రజా బలంతో మంత్రి శ్రీనివాసరెడ్డి బలంగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజలకు తీసుకెళుతున్నారన్న కారణంతోనే ఈడీ, దాడి చేసిందన్నారు. ఈ దాడీని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ రాజకీయంగా ఎదుర్కోవాలని ఆర్థికంగా దెబ్బతీసే కార్యక్రమాలు మానుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతల నైతిక దైర్యాన్ని దెబ్బతీసే కుట్రలను మోడీ, అమిత్ షా, అదానీలు, అంబానీలు మానుకోవాలని సూచించారు.









