కడప,సెప్టెంబర్27 వై 7 న్యూస్
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చూస్తూ వ్యక్తి మృతిచెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడుకడప జిల్లాలో సీకేదీన్నె మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు.‘దేవర’ రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు.దీనికి వచ్చిన మస్తాన్ మూవీచూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు.వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
Post Views: 1,531









