E-PAPER

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎగరని ప్రజాపాలన దినోత్సవం జెండా

చర్ల, సెప్టెంబర్ 17, వై 7న్యూస్ ప్రతినిధి :
జిల్లాలో కలెక్టర్ ప్రతీ ప్రభుత్వ పాఠశాల నందు ప్రజాపాలన దినోత్సవం జరపాలని ఆదేశించినా జిల్లా కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా
చర్ల మండలం లోని చిన్నమిడిసీలేరు గ్రామ పంచాయతీలో గల తిమ్మిరిగూడెం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు ప్రజాపాలన దినోత్సవ జెండాను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోకల నర్సింహామూర్తి ఎగురవేయలేదు.ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ (SCRP )జయప్రకాశ్ ని వివరణ కోరగా జెండా ఎగురవేయని విషయం వాస్తవమే అని, అతని మతిమరుపు వలన ఎగురవేయలేదు అని, ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియజేస్తానని తెలిపారు.పే సెంటర్ ప్రధానోపాధ్యాయురాలుని వివరణ కోరేందుకు చరవాణి లో ప్రయత్నించగా అందుబాటులో లేరు.ప్రజాపాలన దినోత్సవమే గుర్తు లేని ప్రధానోపాధ్యాయుడికి పిల్లలకు చెప్పే పాఠాలు ఏమి గుర్తుంటాయని మండల ప్రజలు సంబంధిత అధికారులు ప్రధానోపాధ్యాయుడు తోకల నర్సింహామూర్తి పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News